Updates

Trump: 30 రోజుల్లోగా వెళ్లిపోండి.. లేదంటే అరెస్టులే.. విదేశీయులకు అమెరికా డెడ్ లైన్.

trump

 

అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు షాకిచ్చింది ప్రసిడెంట్ ట్రంప్ ఆధ్వర్యంలోని యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. 30 రోజులకు పైబడి ఉంటున్న వారు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. లేదంటే ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూచించారు అధికారులు. లేని పక్షంలో జరిమానా విధించడం లేదా అరెస్టు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 

అనధికారికంగా ఉంటున్న వాళ్లు వెంటనే వెళ్లిపోవాలని, ఇటీవలే వచ్చినవాళ్లు.. వీసా గడువు ముగిసిన వాళ్లు  వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ట్రంప్, హోమ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ సెక్రెటరీ నియోమ్ కు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 
H-1B వీసా లేదా అనుమతితో ఉంటున్న విద్యార్థులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. H-1B వీసాతో వచ్చి జాబ్ కోల్పోయిన వాళ్లు నిర్ణీత గడువు తర్వాత ఉండటానికి వీలు లేదు. స్టూడెంట్స్ లేదా ఇతర వీసాలపై వచ్చినవాళ్లు అధికారికంగా ఉన్నట్లుగా రూఢీ చేసుకోవాలని సూచించారు. అయితే విదేశీయులు తమ సొంత ఖర్చులతో వెళ్లాల్సిందిగా చూచించారు అధికారులు. నిబంధనలు పాటించి యూఎస్ లో ఉన్న వాళ్లకు డిపోర్టేషన్ కు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అనధికారి

కంగా ఉంటున్న మైగ్రెంట్స్ వెంటనే పంపించేందుకు వారిని గుర్తించడం జరుగుతుంది. అధికారులు ఆర్డర్ పాస్ చేశాక ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్ విధించనున్నారు. ఆ తర్వాత కూడా వెళ్లకుంటే తర్వాతి రోజు నుంచి వేయి నుంచి 1500 యూఎస్ డాలర్ల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. అయినా వెళ్లని పక్షంలో జైళ్లో వేయడం జరుగుతుందని అన్నారు.